చిరంజీవిని మాస్ హీరోగా నిలబెట్టిన సినిమాల్లో గ్యాంగ్ లీడర్ ఒకటి. 1991లో రిలీజైన ఈ మూవీ అప్పట్లోనే పది కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ మాస్ యాక్షన్ మూవీలో హీరోగా చిరంజీవి ఫస్ట్ ఛాయిస్ కాదంట. నాగబాబు హీరోగా ఈ సినిమా చేయాలని డైరెక్టర్ విజయబాపినీడు అనుకున్నారట.