తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. సీఎం చంద్రబాబు, మాజీ సీఎం వైఎస్ జగన్ , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు కవిత. ఈ సందర్భంగా తెలుగు రాజకీయ ప్రముఖుల గురించి ఒక్కపదంలో చెప్పాలంటూ యాంకర్ ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలోనే పలువురు రాజకీయ నేతల గురించి కవిత చెప్పిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.