Supreme Court Relief to Chandrababu:ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు భారీ ఊరట దక్కింది. సుప్రీంకోర్టులో ఏపీ సీఎం చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ దక్కింది. స్కిల్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ గత వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ఇవాళ విచారణకు రాగా.. సుప్రీంకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ తరుఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన సుప్రీంకోర్టు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో వేసిన చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ డిస్మిస్ చేసింది.