చంద్రబాబును జైల్లో పెట్టి పవన్‌ని సీఎం చేసేందుకు కుట్ర.. కేఏ పాల్ సంచలనం

5 hours ago 1
ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు తన కొడుకును ముఖ్యమంత్రిని చేయడానికి ఆలోచిస్తూ ఉంటే.. పవన్ కళ్యాణ్ మాత్రం తప్పులన్నింటినీ చంద్రబాబు మీద తోసేసి 2029లో సీఎం అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నాడని కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం బాగు కోసం మాత్రం ఎవ్వరూ ఏ ఆలోచనలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ ఎందుకు అడగటం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ ప్యాకేజీ స్టార్స్ అని.. వీళ్లిద్దరూ ప్యాకేజీకి అమ్ముడుకుపోయారని కేఏ పాల్ ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయ్యాడంటే చంద్రబాబు బిక్షే కదా.. లేదంటే పవన్ కళ్యాణ్ జీవితంలో ఎమ్మెల్యే అవ్వగలడా అని కేఏ పాల్ ప్రశ్నించారు. చిరంజీవి ఒకప్పుడు కాంగ్రెస్‌కి అమ్ముడుకుపోయి, ఇప్పుడేమో బీజేపీకి అమ్ముడుపోవటానికి సిద్ధం అవుతున్నాడని కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Entire Article