Explosion In Challapalli Police Station: కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో బాణాసంచా పేలి ఎస్‌ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. పోలీస్ స్టేషన్‌లో ఉన్న బాణాసంచాను పరిశీలిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన నలుగుర్ని వెంటనే స్థానికంగాా ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో పీఎస్‌లోని ఫర్నీచర్, కారు ధ్వంసమయ్యాయి. ఈ పేలుడు ఘటనపై అధికారులు ఆరా తీస్తున్నారు.. పూర్తి వవరాలు తెలియాల్సి ఉంది.