తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్, గంజాయి నివారణకు ఎన్నో చర్యలు తీసుకుంటోంది.. అయినా వాటి వాడకం మాత్రం తగ్గడం లేదు. గుట్టుచప్పుడు కాకుండా.. డ్రగ్స్ తీసుకుంటూనే ఉన్నారు. ప్రభుత్వం డ్రగ్స్‌తో పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఈ దందా మాత్రం ఆగడం లేదు. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని ఓ ఐటీ ఉద్యోగి పుట్టిన రోజు పార్టీలో డ్రగ్స్ కలకలం రేపింది. ఇక్కడ డ్రగ్స్‌తో పాటు.. అత్యంత విలువైన మద్యం కూడా వినియోగించినట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.