ఘట్‌కేసర్‌లో ఓ యువకుడు అదృశ్యం అయ్యాడు. తల్లి, చెల్లితో కలిసి నివసించే మనోజ్ ఆదివారం జ్వరం కారణంగా ఇంట్లోనే ఉన్నాడు. తల్లి రాత్రి 10 గంటలకు ఇంటికి తిరిగి వచ్చేసరికి అతడు కనిపించలేదు. అంతకుముందు ‘చెల్లిని జాగ్రత్తగా చూసుకో.. నాకు బతకాలని లేదు’ అంటూ వాట్సాప్ మెసేజ్ పంపినట్లు తెలిసింది. దీంతో ఆందోళనకు గురైన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘట్‌కేసర్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి యువకుడి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.