చేతబడితో డబ్బు రెట్టింపు చేస్తామంటూ మోసం.. ఆదిలాబాద్‌లో నలుగురు అరెస్ట్‌, 40 మంది బాధితులు!

1 hour ago 1
చేతబడి, ప్రత్యేక పూజల పేరుతో డబ్బును రెట్టింపు చేస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్న ముఠాను ఆదిలాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ‘చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ పేరుతో ముద్రించిన నకిలీ నోట్ల కట్టలను బాధితులకు ఇచ్చి అసలు డబ్బులు కాజేస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసి.. రూ.40 లక్షల నకిలీ నోట్ల కట్టలతోపాటు.. నకిలీ బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నారు. రూ.6.50 లక్షలను రెట్టింపు చేస్తామని నమ్మించి.. మొత్తం రూ.8 లక్షలు మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా వల్ల సుమారు 40 మంది బాధితులై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Read Entire Article