చౌటుప్పల్ జోగిని హత్యకేసు చేధించిన పోలీసులు.. రూ.1.72 కోట్ల సొత్తు స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్

2 hours ago 1
చౌటుప్పల్‌లో జోగిని హత్య కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. అస్సాంకు చెందిన పవన్, హర్షు అలియాస్ హర్షిత్‌లను అరెస్ట్ చేశారు. గతంలో జోగినికి పరిచయమైన ఈ ఇద్దరు నిందితులు.. ఆయన ఇంటికి వచ్చి హత్య చేసి.. బంగారం, వెండి, నగదుతో పాటు కారులో పరారైనట్లు తెలిపారు. కారు జీపీఎస్, ఫాస్టాగ్ సమాచారం ఆధారంగా పోలీసులు వారి ఆచూకీ గుర్తించి పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.1.72 కోట్ల విలువైన బంగారం, వెండి, నగదు, కారును స్వాధీనం చేసుకున్నారు.
Read Entire Article