యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వ జగిత్యాల కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యారు. తన స్వగ్రామమైన లంబాడిపల్లెలో రైతులు ఎదుర్కొంటున్న వడ్ల కొనుగోలు కేంద్రం సమస్యపై కలెక్టర్ సత్యప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. శాశ్వత కేంద్రం లేక రైతులు పడుతున్న ఇబ్బందులను వివరించిన ఆమె.. స్థలం కేటాయిస్తే గ్రామస్తుల సహకారంతో సొంతంగా నిధులు సమకూర్చుకుంటామని చెప్పారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కలెక్టర్.. తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.