జీవో 150తో నీట్ విద్యార్థులకు అన్యాయం.. 1600 మెడికల్ సీట్లు పోతాయ్.. కల్వకుంట్ల కవిత ఆవేదన

4 hours ago 3
తెలంగాణ సర్కార్ తీసుకొచ్చిన జీవో 150పై టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రంగా మండిపడ్డారు. ఆ జీవో 150తో నీట్ విద్యార్థులకు తీరని అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. కేవలం నాలుగేళ్లు తెలంగాణలో చదివిన విద్యార్థులను స్థానికులుగా పరిగణించే నిబంధన వల్ల తెలంగాణ విద్యార్థులకు నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కారణంగా మెడిసిన్‌లో సుమారు 1,600 సీట్లు ఇతర రాష్ట్రాల విద్యార్థులకు వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ జీవోను తక్షణమే సర్కార్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Read Entire Article