ఓ స్కూల్ టీచర్ నిర్వహించిన మైండ్ గేమ్ వీడియో సోషల్ మీడియోలో వైరల్‌గా మారింది. సర్కిల్‌లో నిలబడి కాళ్లు కదపకుండా కుర్చీలో కూర్చోవాలనే సవాలును ఒక విద్యార్థిని స్మార్ట్‌గా పరిష్కరించింది. కుర్చీని తన వెనుకకు తిప్పుకుని కూర్చోవడం ద్వారా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచనతో విజయం సాధించింది. ఇది చూసిన నెటిజన్లు సమాజానికి ఇలాంటి టీచర్లు కదా కావాల్సింది అని కామెంట్లు పెడుతున్నారు. అది ఏ స్కూల్, టీచర్ పేరు తదితర వివరాలు తెలియకపోయినా.. ఆమె టీచింగ్ విధానానికి హ్యాట్సప్ చెబుతున్నారు.