తిరుమల తొక్కిసలాట ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి స్పందించారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే పిఠాపురం పర్యటనలో పవన్ కళ్యాణ్ ఈ విషయమై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడైనా తప్పు జరిగితే అది తమ సమష్టి బాధ్యతన్న పవన్ కళ్యాణ్.. అందుకే తాను క్షమాపణలు చెప్పానన్నారు. తాను క్షమాపణలు చెప్పినా కూడా.. సారీ చెప్పేందుకు అధికారులకు ఎందుకు నామోషీ అని ప్రశ్నించారు. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో, అదనపు ఈవో, బోర్డు సభ్యులు కూడా తిరుమల తొక్కిసలాట ఘటనపై క్షమాపణ చెప్పాల్సిందే అని అన్నారు. అధికారులు తప్పు చేయడంతో.. ప్రజలు సంక్రాంతి సంబరాలు కూడా చేసుకోలేకపోతున్నారని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.