Tanuku Mla Launches Whatsapp Services: తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి 'మీ సమస్య – నా పరిష్కారం' పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాట్సాప్ నంబర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించనున్నారు. 94934 22222 నంబర్‌కు వాట్సాప్ ద్వారా సమస్యలను తెలియజేయవచ్చు. మనమిత్ర యాప్ స్ఫూర్తితో ఈ సేవలను అందిస్తున్నట్లు ఎమ్మెల్యే రాధాకృష్ణ తెలిపారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నామన్నారు.