టీడీపీ నేత ఇంటికి పుదుచ్చేరి సీఎం రంగస్వామి

2 weeks ago 4
పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి నెల్లూరు వచ్చారు. తెలుగుదేశం పార్టీ నేత, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఇంటికి పుదుచ్చేరి సీఎం వెళ్లారు. రోడ్డు మార్గంలో యానాం వెళ్తూ దారిలో నెల్లూరులోని అబ్దుల్ అజీజ్ ఇంటికి రంగస్వామి వెళ్లారు. సోమవారం ఉదయం 10 గంటల 30 నిమిషాల ప్రాంతంలో అబ్దుల్ అజీజ్ ఇంటికి వెళ్లిన రంగస్వామికి అక్కడ ఘనస్వాగతం లభించింది. పుదుచ్చేరి సీఎంను శాలువా, పుష్పగుచ్ఛంతో సత్కరించిన అజీజ్.. ఆయనికి తిరుపతి ప్రసాదం అందజేశారు. అనంతరం అజీజ్ ఇంట్లోనే రంగస్వామి టిఫిన్ చేశారు. ఆ తర్వాత యానాం బయలుదేరి వెళ్లారు. పుదుచ్చేరి సీఎం రంగస్వామికి తన కజిన్‌ రఫీ అత్యంత సన్నిహితంగా ఉంటారని అబ్దుల్ అజీజ్ మీడియాకి తెలిపారు. తాను వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా తనను అభినందించేందుకు సీఎం రంగస్వామి వచ్చారని చెప్పారు. యానాం వెళ్తూ తన ఇంటికి వచ్చి తనను అభినందించారని వెల్లడించారు. గతంలోనూ పలుమార్లు రంగస్వామి తన ఇంటికి వచ్చారని గుర్తుచేశారు.
Read Entire Article