తమ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టుపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపిస్తున్న వైసీపీ.. దీనిని ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించింది. వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా యాక్టివిస్టులకు న్యాయపరంగా సహాయం చేయడం సహా అన్నిరకాలుగా అందుబాటులో ఉండేలా కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించింది. ఇక జిల్లాస్థాయిలోనూ ఏర్పాటు చేయాలన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లాలో దేవినేని అవినాష్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించారు.