Alla Nani Join In TDP: వైఎస్సార్‌సీపీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గత జగన్ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు టీడీపీవైపు చూస్తున్నారు. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలుగు దేశం పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఆళ్ల నాని ఇటీవల వైఎస్సార్‌సీపీ అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు.. ఆయన అనూహ్యంగా టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. నేడు చేరిక ఉంటుందనే తెలుస్తోంది.. అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.