విజయవాడలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు పోలీసులు సాంకేతికత సాయం తీసుకుంటున్నారు. ఇప్పటికే డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ రద్దీని పర్యవేక్షిస్తున్న పోలీసులు.. అస్త్రం యాప్ ద్వారా కూడా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా చర్యలు చేపడుతున్నారు. తాజాగా ట్రాఫిక్ సమస్యల పరిష్కారం కోసం ట్రాఫిక్ అంబాసిడర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వెల్లడించారు. అక్టోబర్ నెలతో పోలిస్తే నవంబర్‌లో ట్రాఫిక్ విషయంలో చాలావరకూ మెరుగయ్యామన్న విజయవాడ సీపీ.. డిసెంబర్ నెలలో మరింత మెరుగయ్యేలా చర్చలు తీసుకుంటున్నామన్నారు.