హైదరాబాద్‌లో ట్రాఫిక్ కూడళ్ల వద్ద హారన్ మోగింపుతో శబ్ద కాలుష్యం పెరుగుతోంది. ముంబై, బెంగళూరులో విజయవంతమైన 'హాంక్ మోర్.. వెయిట్ మోర్' విధానాన్ని హైదరాబాద్‌లోనూ అమలు చేస్తే శబ్ద కాలుష్యం గణనీయంగా తగ్గుతుందని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ఈ టెక్నాలజీ ఆధారిత పరిష్కారం ప్రజలలో మార్పు తెస్తుందని భావిస్తున్నారు.