రోగుల భద్రత, వైద్యసేవల నాణ్యత పెంపు లక్ష్యంగా ఎన్‌హెచ్‌ఎం కొత్త ప్రిస్క్రిప్షన్ ఆడిట్ మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రిస్క్రిప్షన్లను క్రమం తప్పకుండా పరిశీలించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖను సూచించింది. రోగి పూర్తి వివరాలు, మెడికల్ హిస్టరీ, అలెర్జీలు, పరీక్షల ఫలితాలు, మందుల ఫార్ములా, మోతాదు, వినియోగించే విధానం, తదుపరి రివ్యూ తేదీ స్పష్టంగా రాయాలి. రోగికి అనవసర యాంటీబయాటిక్స్, సిరప్‌లు, ఇంజెక్షన్ల వాడకాన్ని తగ్గించడంపైనా ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఫార్మకాలజిస్టులు, క్లినికల్ ఫార్మకాలజిస్టులు ఈ ఆడిట్లను నిర్వహించనున్నారు.