డ్రోన్ ప్రమాదం.. హోం మంత్రి అనిత చేతికి గాయం..

1 hour ago 2
హోం మంత్రి వంగలపూడి అనిత చేతికి స్వల్ప గాయమైంది. తిరుపతిలో అమరావతి ఛాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రి అనిత హాజరయ్యారు. అయితే కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన డ్రోన్.. బ్యాటరీ తగ్గి హోం మంత్రి అనిత మీద పడింది. ఈ ఘటనలో అనిత చేతికి స్వల్ప గాయం కాగా.. బ్యాండేజీ వేసుకుని ఆమె కార్యక్రమంలో యథావిధిగా పాల్గొన్నారు. మరోవైపు ఈ అమరావతి ఛాంపియన్‌షిప్ పోటీలలో పదివేల మంది వరకూ క్రీడాకారులు పోటీపడుతున్నారు.
Read Entire Article