ప్రజలకు పోస్టల్ సేవలను మరింత అందుబాటులోకి తీసుకువస్తూ తపాలా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఉదయం మాత్రమే పోస్టల్ సేవలు అందిస్తుండగా.. ఇక నుంచి రాత్రి కూడా సర్వీసులు కొనసాగనున్నాయి. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు పోస్టల్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందుకోసం నగదు చెల్లింపులను కాకుండా కేవలం ఆన్ లైన్ చెల్లింపులను తీసుకుంటున్నారు. రాత్రి పూట పనిచేసే తపాలా ఉద్యోగులను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.