క్లాస్‌రూంలో విద్యార్థులకు పాఠాలు చెబుతున్న ఓ లెక్చరర్‌కు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు వెల్లడించారు. అప్పటివరకు చాలా హుషారుగా పాఠాలు చెప్పిన లెక్చరర్.. అనూహ్యంగా గుండెపోటుతో మరణించడం.. ఆ కాలేజీలో తీవ్ర విషాదం నింపింది. ఇటీవల డ్రైవింగ్ చేస్తుండగానే గుండె పోటుతో ఆర్టీసీ డ్రైవర్ ప్రాణాలు విడిచిన ఘటన మర్చిపోకముందే.. మరో సంఘటన చోటు చేసుకుంది.