పెళ్లి చూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఓం శాంతి శాంతి శాంతి:'. ఏ.ఆర్ సజీవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఈషా రెబ్బా హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా జనవరి 23న రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్లు చేస్తూ మూవీ టీమ్ సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ చేస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి 'ఓం శాంతి థీమ్' అంటూ సెకండ్ సింగిల్‌ను రిలీజ్ చేశారు.