తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు , హోంమంత్రి వంగలపూడి అనిత, పలువురు ఎమ్మెల్యేలు విశాఖలో చెక్కులు అందజేశారు. టీటీడీ తరపున 25 లక్షల రూపాయలు, బోర్డు సభ్యుల తరఫున రూ. 2.5 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. కుటుంబంలో ఒక వ్యక్తికి టీటీడీలో కాంట్రాక్ట్ ఉద్యోగం.. చదువుకునే పిల్లలు ఉంటే వారి పిల్లలకు సహకారం అందిస్తామని అన్నారు. తొక్కిసలాట ఘటన దురదుష్టకరమని వారి కుటుంబాలకు భరోసా ఇచ్చారు.