తిరుపతి స్విమ్స్ ఆవణలో ఒక వినూత్న కార్యక్రమం జరుగుతోంది. రెండు రోజుల పాటు పీజీ విద్యార్థులకు రోబోటిక్, లాపరస్కోపిక్ సర్జరీలపై ఉచితంగా డెమో ఇస్తున్నారు. ఢిల్లీ నుంచి ఓ ఏసీ బస్సులో ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుంది. స్విమ్స్‌లోని జనరల్ సర్జరీ, గైనకాలజీ సర్జికల్ ఆంకాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాలకు చెందిన డాక్టర్లు, పీజీ విద్యార్థులు, రెసిడెంట్ డాక్టర్లకు ఈ బస్సులో శిక్షణ ఇచ్చరు. ఆపరేషన్ సమయంలో ఉపయోగపడే వాటి గురించి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.