తిరుమలలో సోమవారం రెండు ప్రమాదాలు జరిగాయి. సోమవారం ఉదయం తిరుమల శ్రీవారి లడ్డూ కౌంటర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. 47వ లడ్డూ కౌంటర్‌లో మంటలు చెలరేగగా.. టీటీడీ సిబ్బంది అప్రమత్తమై వెంటనే మంటలు ఆర్పివేశారు. మరోవైపు సోమవారం మధ్యాహ్నం తిరుమల ఘాట్ రోడ్డులో బస్సు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పిట్టగోడను ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని పది మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. అయితే అందరికీ స్వల్ప గాయాలు కావటంతో పెను ప్రమాదం తప్పింది.