Andhra Pradesh Temples Bolebaba Dairy Adulterated Ghee : తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన వ్యవహారంలో సిట్ విచారణ సంచలన విషయాలు వెల్లడించింది. ఉత్తరాఖండ్ కు చెందిన భోలేబాబా డెయిరీ, పలు దేవాలయాలకు కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి హరిమోహన్ రాణా బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. సిట్ అధికారులు భోలేబాబా డైయిరీ మాజీ డైరెక్టర్లను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.