TTD Tenders For Empty Tins: టీటీడీ మరోసారి వేలం పాటకు సిద్ధమైంది. తిరుమల శ్రీవారి ఆలయంలో ఖాళీ టిన్‌లకు సంబంధించి ఈ నెల 27 వరకు సీల్డ్ టెండర్లను ఆహ్వానిస్తోంది.. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలలోపు అందజేయాలని సూచించింది. ఆసక్తిక ఉన్నవారు వెంటనే టెండర్లు దాఖలు చేయాలని సూచించారు. 2026 మార్చి వరకు టిన్లు సేకరించొచ్చు. ఈ మేరకు వేలం పాటకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.