తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మాజీ మంత్రి ఆర్కే రోజా దర్శించుకున్నారు. వైకుంఠ ద్వాదశి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా.. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఏపీ ప్రజలకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు.. అందరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.