Hyderabad Gutta Sri Harsha Sai Chowdary Rs 1 Crore Donated To TTD: తిరుమల శ్రీవారికి భక్తులు భారీగా విరాళాలు అందుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌కు చెందిన మరో భక్తుడు టీటీడీ ట్రస్టుకు భారీ విరాళం అందించారు. గుత్తా శ్రీహర్షసాయి చౌదరి టీటీడీ శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.కోటిని అందజేశారు. ఈ మేరకు దాత టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి విరాళాన్ని అందజేశారు.. దాతను ఛైర్మన్ అభినందించారు.