ఏపీలో ఆహార పరీక్షల ల్యాబ్ల ఏర్పాటు కోసం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం, FSSAI మధ్యన రూ.88 కోట్ల విలువైన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ల్యాబులతో పాటుగా మౌలిక వసతులను FSSAI ఏర్పాటు చేయనుంది. ఒప్పందంలో భాగంగా తిరుమల, కర్నూలులో FSSAI ల్యాబ్లు ఏర్పాటు చేయనుంది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, FSSAI అధికారుల మధ్యన ఈ ఒప్పందం జరిగింది.