తిరుమలలో అగ్ని ప్రమాదం.. లడ్డూ కౌంటర్‌లో మంటలు

1 week ago 4
Fire Accident at tirumala laddu Counter: తిరుమల లడ్డూ కౌంటర్‌లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. తిరుమలలోని 47వ లడ్డూ కౌంటర్‌లో సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. కంప్యూటర్ సిస్టమ్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో కౌంటర్ మొత్తం పొగతో నిండిపోయింది. లడ్డూ ప్రసాదాలు తీసుకునేందుకు కౌంటర్ వద్దకు వచ్చిన భక్తులు భయపడిపోయారు. అయితే వెంటనే అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా దెబ్బతిన్న కంప్యూటర్ సిస్టమ్‌ను పునరుద్ధరించే ప్రయత్నాల్లో ఉన్నారు.
Read Entire Article