తెలంగాణ టీనేజ్ బాలికల కోసం సరికొత్త కార్యక్రమం.. మహిళల మాదిరే వారికి కూడా

4 months ago 8
మహిళా సాధికారతకు స్వయం సహాయక సంఘాల ఏర్పాట్లు చేసినట్లుగానే... రాష్ట్రంలోని టీనేజ్ అమ్మాయిలు అనగా 14-18 ఏళ్ల బాలికల కోసం 'స్నేహ' పేరుతో కొత్త సంఘాలను ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఈ సంఘాలు బాలికలకు విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం, సామాజిక చైతన్యం, నాయకత్వ లక్షణాలపై అవగాహన కల్పించడంతో పాటు బాల్య వివాహాలను అరికట్టడంలో సహాయపడతాయి. యునిసెఫ్ సాంకేతిక భాగస్వామ్యంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రాజెక్టును విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతి గ్రామంలో ఒక సంఘం ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది
Read Entire Article