తెలంగాణలోని స్థానికులకు పర్యాటక రంగం ద్వారా అదనపు ఆదాయం కల్పించేందుకు ప్రభుత్వం త్వరలోనే ఒక ప్రత్యేక హోమ్‌స్టే పథకాన్ని ప్రారంభించనుంది. దీని ద్వారా నివాస గృహాలను పర్యాటకుల బసకు వినియోగించుకునేందుకు యజమానుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. తెలంగాణ టూరిజం పాలసీ 2025-30లో భాగంగా ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా గ్రామీణ, పట్టణ, గిరిజన ప్రాంతాల సంస్కృతి, వంటకాలు, హస్తకళలను పర్యాటకులకు పరిచయం చేయడమే కాక.. భారీ కమర్షియల్ నిర్మాణాలు లేకుండానే వసతి సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.