తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై మరో కీలక అప్డేట్ ఇచ్చింది రాష్ట్ర ఎన్నికల సంఘం. మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్‌పర్సన్లు, వైస్ ఛైర్‌పర్సన్ల ఎన్నికను చేతులెత్తే పద్ధతిలో నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 11న ఎన్నికలు జరగనుండగా.. 13న కౌటింగ్, 16న మేయర్లు, డిప్యూటీ మేయర్లు, ఛైర్‌పర్సన్లు, వైస్ ఛైర్‌పర్సన్ల ఎన్నికను నిర్వహించనున్నారు.