'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' రంగారెడ్డి జిల్లాలోని ఫ్యూచర్ సిటీలో ప్రారంభమైంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సదస్సును ప్రారంభిస్తూ.. తెలంగాణ 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. వికసిత్ భారత్ దిశగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విజన్‌తో పనిచేస్తోందన్నారు. ఈ సదస్సులో 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ట్రంప్ మీడియా టెక్నాలజీస్ సంస్థ రూ. లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.