Telangana Farmers App For Organic Products: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. సేంద్రియ ఉత్పత్తులకు ప్రత్యేక యాప్ తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం యాప్‌ను సిద్ధం చేస్తోంది. నకిలీల నుంచి విముక్తి కల్పించేలా యాప్ తీసుకొస్తున్నారు. ఈ యాప్‌లో సమగ్ర సమాచారం ఉండేలా ప్లాన్ చేశారు. అటు రైతులు, ఇటు ప్రజలకు ఉపయోగంగా ఉండేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఈ యాప్ అందుబాటులోకి వస్తుంది అంటున్నారు.