తెలంగాణలోని ఏపీ కేడర్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరందరినీ ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. తెలంగాణ కేడర్‌గా గుర్తించాలన్న విజ్ఞప్తిని కేంద్రం తిరస్కరించింది. వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో రిపోర్టు చేయాలంటూ ఆదేశించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి సహా ఐఏఎస్ అధికారులు రోనాల్డ్ రోస్, వాకాటి కరుణ, వాణీప్రసాద్, మల్లెల ప్రశాంతి వంటి వారు ఏపీలో రిపోర్టు చేయాల్సి ఉంటుంది.