మహాత్మాగాంధీ యూనివర్సిటీ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటం చేయడంతో పా టు విద్యార్థుల ఇబ్బందులను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. నల్లగొండలో జరిగిన రైతు ధర్నాకు హైదరాబాద్ నుంచి వచ్చే సమయంలో ఎంజీయూ వద్ద విద్యార్థుల విజ్ఞప్తితో ఆగారు.. విద్యార్థులతో మాట్లాడటంతోపాటు వినతిపత్రం తీసుకున్నారు. ప్రధానంగా విద్యార్థుల హాజరు విషయంతో పాటు యూనివర్సిటీలో అభివృద్ధి, నాణ్యమైన ఆహారం, నెల రోజులపాటు పరీక్షలు వాయిదా విషయాన్ని మాజీ మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. యూనివర్సిటీలో వీసీ నియంతృత్వ పోకడలతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు.యూనివర్సిటీకి మంచి రోజులు వస్తాయని, తాను విద్యార్థుల సమస్యల గురించి గవర్నర్‌తో చర్చిస్తానన్నారు.