తెలంగాణకు మూడు కొత్త కేంద్ర సంస్థలు రానున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రూ. 250 కోట్లతో మిల్లెట్స్ పరిశోధన కేంద్రం, సికింద్రాబాద్‌లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ , నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు కానున్నాయని చెప్పారు. ఇది రాష్ట్రంలో పరిశోధన, నైపుణ్యాభివృద్ధికి ఊతమిస్తుందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. మేడిగడ్డ ప్రాజెక్టును సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.