తెలంగాణలో మళ్లీ వర్షం ముప్పు పొంచి ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు వర్షం కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఈ మేరకు పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఈనెల 6 లేదా 7న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు.