తెలంగాణలో కొత్తగా 4 రైల్వే లైన్లు.. ఈ మార్గాల్లోనే, ఇక సాఫీగా ప్రయాణం

5 hours ago 1
హైదరాబాద్‌ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు రైలు ప్రయాణం వేగవంతం కానుంది. ఘట్‌కేసర్‌–కాజీపేట మధ్య మూడు, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం లభించింది. రూ.2,419 కోట్లతో 110 కిలోమీటర్ల మార్గాన్ని నాలుగేళ్లలో పూర్తిచేయాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ముంబయి, విజయవాడ–విశాఖ, బల్లార్ష–దిల్లీ మార్గాల్లోనూ అదనపు లైన్ల పనులు కొనసాగుతున్నాయి. ట్రాక్‌ సామర్థ్యం పెరగడంతో క్రాసింగ్‌లు, రైళ్ల నిలిపివేతలు తగ్గి వేగం పెరగనుంది. ప్రయాణికులతోపాటు బొగ్గు, ఉక్కు, సిమెంట్‌ వంటి సరకు రవాణాకు కూడా ఈ విస్తరణలు ప్రయోజనం చేకూర్చనున్నాయి.
Read Entire Article