Telangana Cheyutha Pensions With Out Certificates: తెలంగాణ ప్రభుత్వం చేయూత పింఛన్లకు సంబంధించి మరో క్లారిటీ ఇచ్చింది. ధ్రువపత్రాలు లేకున్నా పింఛను నమోదుకు అవకాశం కల్పించింది. ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా దరఖాస్తు చేసుకోవచ్చని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) తెలిపింది. కాకపోతే దరఖాస్తుల పరిశీలన సమయంలో ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని సూచించారు. అంతేకాదు చేయూత పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గడువును ఈ నెల 15 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.