రాజీవ్ రహదారిపై రద్దీని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రతిపాదించింది. సుమారు 205 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్న ఈ రహదారికి రూ.4 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ ఎక్స్‌ప్రెస్‌వే శామీర్‌పేట నుంచి మొదలై.. హుస్నాబాద్ మీదుగా వెళ్తుంది. ఇది నాగ్‌పూర్-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేకు అనుసంధానం అవుతుంది. ఈ కొత్త రహదారితో ప్రయాణ సమయం, ప్రమాదాలు తగ్గుతాయని, ఆయా ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధి జరుగుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.