తెలంగాణలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. చాలా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రికార్డు స్థాయిలో సింగిల్ డిజిట్‌కే టెంపరేచర్లు పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచిస్తున్నారు. రాబోయే ఐదు రోజులు చలి తీవ్రత, పొగమంచు ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.