తెలంగాణలో దసరా పండుగ సీజన్‌లో మద్యం విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ఎక్సైజ్ శాఖ గణాంకాల ప్రకారం 19 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా రూ.2,054.51 కోట్ల విలువైన మద్యం అమ్ముడైంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాల విలువ 37.02 శాతం పెరిగింది. బీర్ల విక్రయాలు 30.37 లక్షల కేసులకు చేరగా.. గత ఏడాదితో పోలిస్తే 8.82 లక్షల కేసులు అదనంగా అమ్ముడయ్యాయి. బీర్ల అమ్మకాల్లో 40.93 శాతం.. మద్యం విక్రయాల్లో 29.80 శాతం వృద్ధి నమోదైంది. అక్టోబర్ 19న ఒక్కరోజే రూ.303.40 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి.