దక్షిణ మధ్య రైల్వే పరిధిలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పలు రేల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇటీవల బేగంపేట స్టేషన్ ప్రారంభం కాగా.. హఫీజ్‌పేట స్టేషన్‌ను మరో రెండు నెలల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు రైల్వే అధికారులు. ఈ స్టేషన్‌లో 85 శాతం పనులు పూర్తయ్యాయని రైల్వే అధికారులు తెలిపారు. త్వరలోనే పనులన్నీ పూర్తి చేసి.. ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామని రైల్వే అధికారులు తెలిపారు.