తెలంగాణలోని ప్రతి ఇంటికీ చౌకైన, హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్‌ను అందించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ నిర్ణయం వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని వర్గాలకు మేలు జరగనుంది. రైతులకు సాగు సమాచారం, ప్రజలకు టెలిమెడిసిన్, ఈ-పాలన సేవలు, విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యా వనరులు అందుబాటులోకి రానున్నాయి. పల్లెలను విజ్ఞాన కేంద్రాలుగా మారటంతో.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం కానుంది.