దసరా సెలవుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. సెలవుల్లో స్పెషల్ క్లాసులు నిర్వహించొద్దని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలను ఆదేశించింది. దసరా పండుగను పురస్కరించుకుని ఇప్పటికే విద్యాశాఖ స్కూళ్లు, కాలేజీలకు సెలవుల షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈనె 10 నుంచి 22 వరకు స్కూళ్లకు 13 రోజులు.. ఇంటర్ కాలేజీలకు ఈనెల 10 నుంచి 21 వరకు 12 రోజుల సెలవులు ఇచ్చింది. తిరిగి ఈనెల 22న తరగతులు పునఃప్రారంభం కానున్నాయి.